ఆస్తులు ప్రకటించని 7గురు టీడీపీ ఎంపీలు..

ఆస్తులు ప్రకటించని 7గురు టీడీపీ ఎంపీలు..

పార్లమెంటు సభ్యుల్లో ఆస్థులు ప్రకటించని వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 65 మంది లోక్ సభ, 29మంది రాజ్యసభ సభ్యులు ఇంతవరకు తమ ఆస్థులు, అప్పుల వివరాలను ప్రకటించలేదు. ఆర్టీఐ చట్టం ద్వార విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన 7గురు, టీఆర్ఎస్ ఎంపీలు 4గురు ఉన్నారు.  61 మంది లోక్  సభ ఎంపీలు 2014 నుంచి ఆస్థులు, అప్పుల వివరాలను ప్రకటించలేదని ఆర్టీఐ ద్వారా రచనా కర్లా అడిగిన వివరాలను లోక్ సభ సెక్రటరీ తెలియజేశారు. 

ఇటీవల ఉపఎన్నికల్లో గెలుపొందిన మరో నలుగురు కూడా ఆస్థుల వివరాలను ప్రకటించలేదని ఆయన తెలిపారు. వారికి 90రోజుల సమయం ఉంటుందని పేర్కొన్నారు. ఆస్థులు ప్రకటించని లోక్ సభ ఎంపీల్లో కాంగ్రెస్ కు సంబంధించి 9మంది, టీడీపీ ఎంపీల్లో 7గురు ఉన్నారు. తృణముల్ కాంగ్రెస్, బిజూ జనతా దళ్, బీజేబీ, సమాజ్ వాది పార్టీ, లోక్ జన్ శక్తి నుంచి 4గురు చొప్పున ప్రకటించలేదు. 

ఆప్ పార్టీ ఎంపీలు కూడా ముగ్గురు తమ ఆస్థుల వివరాలను వెల్లడించలేదు. శివసేన, రాష్ట్రీయ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్, జనదళ(యూ) జెఎంఎం ఎంపీలు ఇద్దరు చొప్పున వెల్లడించలేదు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏఐఏడీఎంకే, ఇండియన్ నేషనల్ లోక్ దళ్,నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, పీడీపీ, ఎన్డీపీపీ, ఏఐఎంఐఎం, ఆర్ఎల్ డీల నుంచి ఒక్కొక్క ఎంపీ వివరాలు ప్రకటించాల్సి ఉందని తెలిపారు. ఇక రాజ్యసభ ఎంపీలు కూడా  29 మంది ఆస్థులు ప్రకటించలేదు. ఇందులో బీజేపీ ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరుగురు ఉన్నారు. ముగ్గురు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కూడా ఇంతవరకు వారి వారి ఆస్థులు వెల్లడించలేదు.