జాతీయ చలచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా మహానటి..

జాతీయ చలచిత్ర అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రంగా మహానటి..

కేంద్రప్రభుత్వం 66 వ జాతీయ చలచిత్ర అవార్డులను ప్రకటించింది.  ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా మహానటి ఎంపికైంది.  అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.  మహానటి పాత్రలో కీర్తి సురేష్ నటించింది.  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  

మహానటి సినిమాకు ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం పట్ల తెలుగు సినిమా పరిశ్రమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.  వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.  సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ మూవీలో నటించారు.