ఘోర అగ్నిప్రమాదం.. 69 మంది మృతి

ఘోర అగ్నిప్రమాదం.. 69 మంది మృతి

ఘోర అగ్నిప్రమాదంలో 69 మంది మృతి చెందారు. ఈ దారుణ ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 10.40 సమయంలో ఢాకాలోని చౌక్‌బజార్ అపార్ట్‌మెంట్‌లోని రసాయనాల గోదాములో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాపించాయి. పక్కనే ఉన్న మరో నాలుగు భవనాలకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 69 మంది మృతిచెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.