కస్తూర్బా బాలికల పాఠశాలలో కరోనా కలకలం.. పెరిగిన కొత్త కేసులు..!

కస్తూర్బా బాలికల పాఠశాలలో కరోనా కలకలం.. పెరిగిన కొత్త కేసులు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది... తెలంగాణలోనూ వరుసగా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ఝరాసంఘంలో కరోనా కలకలం సృష్టించింది.. అక్కడి కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో.. ఇప్పటి వరకు స్కూల్‌లో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. తాజా కేసుల్లో ఒక ఆయా సహా ఆరుగురు విద్యార్థినులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ద్వారా ఓ విద్యార్థినికి కరోనా సోకగా.. ఆ విద్యార్థిని ద్వారా పాఠశాలలో పలువురికి కరోనా వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, దీంతో అప్రమత్తమైన అధికారులు.. అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే పనిలో పడిపోయారు.. గ్రామంలో కోవిడ్ లక్షణాలు ఉన్న అందరికీ టెస్టులు నిర్వహిస్తున్నట్టు డీఎంహెచ్ సునీల్ తెలిపారు. కస్తూర్బా పాఠశాలలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.