క్షణక్షణానికి మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు

     క్షణక్షణానికి మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు

మహారాష్ట్ర రాజకీయాలు అనేక మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు. ఉదయం అజిత్  వెంట వెళ్లిన ఏడుగురు ఎమ్మెల్యేలు వెనక్కి తిరిగొచ్చి పవార్ ను స్వయంగా కలుసుకున్నారు. అధినేత పట్ల తమ సంపూర్ణ విశ్వసాన్ని ప్రకటిస్తున్నారు.తమను తప్పుదారి పట్టించారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 54మంది ఎమ్మెల్యేల్లో.. 37మంది ఎమ్మెల్యేలు పవార్ ను కలిసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు శాసనసభా పక్ష నాయకుడి పదవి నుంచి అజిత్ ను తొలగిస్తూ ఎన్సీపీ చీఫ్ నిర్ణయం తీసున్నారు.

కొత్త శాసనసభా పక్ష నేతగా దిలీప్ వాల్సేను ఎన్నిక చేశారని తెలుస్తోంది. మహారాష్ట్రలో పరిస్థితి అంతా సవ్యంగా ఉందని శరద్ పవార్ స్పష్టం చేసారు. కమలనాథులు అంచనాలను తలకిందులు చేస్తూ పవార్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఉదయం ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం తదనంతరం పరిణామాలపై ఒకదశలో పవార్ తెరవెనుక ఉండి అసలు కథ నడిపారని విమర్శలు వెల్లువెత్తాయి.కాంగ్రెస్ నేతలు సైతం కొందరు కామెంట్లు చేసారు. అయితే సంక్లిష్ట పరిస్థితుల నుంచి తేరుకున్న పవార్ అటు శివసేన, ఇటు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకున్నారు.