విశాఖ చైతన్య క్యాంపస్ లో పుడ్ పాయిజన్

విశాఖ చైతన్య క్యాంపస్ లో పుడ్ పాయిజన్

విశాఖ కొమ్మాదిలోని శ్రీచైతన్య విద్యార్ధినులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. 70మందికి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో యాజమాన్యం స్థానిక ఆసుపత్రి వైద్యులతో చికిత్స అందించింది. మైత్రి హాస్టల్లో వున్న స్టూడెంట్స్ రెండు రోజులుగా డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. విద్యార్ధినులు అస్వస్థతకు గురైన సంగతి తల్లిదండ్రులకు తెలియజేయకుండా యాజమాన్యం గోప్యత పాటించింది. ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న పేరెంట్స్ క్యాంపస్ నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి పుడ్ పాయిజనే ప్రధాన కారణమని సమాచారం.