పి.వి.సింధునిచ్చి పెళ్లిచేయాలని వృద్ధుడి వినతి !

పి.వి.సింధునిచ్చి పెళ్లిచేయాలని వృద్ధుడి వినతి !

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత పి.వి.సింధుతో తనకు పెళ్లిచేయాలని డిమాండ్ చేస్తున్నాడు తమిళనాడుకు చెందిన మలైస్వామి అనే డెబ్బైఏళ్ల వృద్ధుడు. ఒకవేళ సింధుతో తనకు వివాహం చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఈ మేరకు రామనాథపురం జిల్లా కలెక్టర్ కు మలైస్వామి లెటర్ రాశాడు. సింధు ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని మలైస్వామి చెప్పాడు.

లెటర్ లో తన వయస్సు కేవలం 16 ఏళ్లని, 2004 ఏప్రిల్ నాలుగున పుట్టానని మలైస్వామి పేర్కొనడం కొసమెరుపు. రామనాథపురం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో మలైస్వామి ఈ కోరిక కోరాడు.  వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే.. ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని మలైస్వామి పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌తో కలెక్టర్‌తో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.