ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు... 45 మంది మృతి... 

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు... 45 మంది మృతి... 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 7228 కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,46,530కి చేరింది.  ఇందులో 70,357 కేసులు యాక్టివ్ గా ఉండగా, 5,70,667 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో 45 మంది మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 5506కి చేరింది.  

జిల్లాల వారీగా చూసుకుంటే, అనంతపూర్ లో 612, చిత్తూరులో 536, తూర్పు గోదావరిలో 1112, గుంటూరులో 648, కడపలో 600, కృష్ణలో 428, కర్నూలులో 229, నెల్లూరులో 479, ప్రకాశంలో 502,శ్రీకాకుళంలో 319, విశాఖపట్నంలో 414, విజయనగరంలో 387, పశ్చిమ గోదావరిలో 962 కేసులు నమోదయ్యాయి.