టీటీడీ సంచలన నిర్ణయం.. చిత్తూరు వాసులకే 75 శాతం ఉద్యోగాలు..!

టీటీడీ సంచలన నిర్ణయం.. చిత్తూరు వాసులకే 75 శాతం ఉద్యోగాలు..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు వేంకటేశ్వరుడి దర్శనభాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన టీటీడీ.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం సంచలంగా మారింది. చిత్తూరు జిల్లా వాసులకు ఉద్యోగాల భర్తీలో 75 శాతం రిజర్వేషన్‌కు ఆమోద ముద్ర వేసింది టీటీడీ పాలక మండలి.. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు ఈ రిజర్వేషన్‌ వర్తించనుంది. టీటీడీ పాలకమండలి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వ అనుమతికి పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. ఇక, టీటీడీలో లోకల్ రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు.