బీర్ కోసం వెళ్లిన వ్యక్తకి భారీ జరిమానా... ఎందుకంటే...
ప్రపంచంలో చాలా దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్తలో భాగంగా అక్కడి ప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇంగ్లాండ్ దేశంలో సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కరోనా సోకినా వ్యక్తులు ఐసోలేషన్ లో ఉండకుంటే భారీ జరిమానా విధిస్తోంది. ఇటీవలే ప్రభుత్వం దీనిపై చట్టం చేయడంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొంతమంది రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. 79 ఏళ్ల హేన్రి అనే వ్యక్తి ఇటీవలే లండన్ వచ్చాడు. నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్ లో ఉంచారు. ప్రతిరోజూ పోలీసులు అతని ఇంటికి వెళ్లి చెక్ చేస్తున్నారు. అయితే, ఓ రోజు హేన్రి ఇంటికి వెళ్లిన పోలీసులకు హేన్రి కనిపించలేదు. దీంతో పోలీసులు అధికారులకు సమాచారం అందించగా, క్రాబి జాక్ అనే పబ్ వద్ద హేన్రి కారును గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకొని కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు హేన్రికి కోర్ట్ రూ. 4.74 లక్షల రూపాయల జరిమానా విధించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)