ఏపీలో ఫైనల్‌గా పోలింగ్ శాతం ఎంతంటే..!

ఏపీలో ఫైనల్‌గా పోలింగ్ శాతం ఎంతంటే..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడుద పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 79.64 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 1.64 శాతం ఎక్కువగా నమోదైనట్టు తెలిపారు. ఇక ఈసారి అత్యధికంగా విజయనగరం జిల్లాలో 80.68శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యల్పంగా విశాఖలో 71.81 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేద్రాలో ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది... దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు క్యూ లైన్‌లో నిలబడ్డ ప్రతీ ఒక్కరికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలుచోట్ల అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఇక ఫలితాలపై ఎవరి ధీమా వారికి ఉండగా... ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపారు..? ఎవరి పట్టం కడతారు? అనేది మాత్రం మే 23వ తేదీన తేలిపోనుంది. ఇప్పుడు ఓటర్లకు టెన్షన్ తప్పినా.. మన నేతలకు మాత్రం అప్పటి వరకు టెన్షన్ తప్పదన్నమాట.