బోటు వెలికితీత.. 8 మృతదేహాలు లభ్యం..! మరో 4 ఎక్కడ..?

బోటు వెలికితీత.. 8 మృతదేహాలు లభ్యం..! మరో 4 ఎక్కడ..?

గోదావరిలో మునిగిపోయిన బోటు మొత్తానికి 38 రోజుల తర్వాత బయటకు తీశారు.. ఆ తర్వాత ఒడ్డుకు చేర్చారు.. పూర్తిగా ధ్వంసమైన ఈ బోటులో.. 8 మృతదేహాలు బయటపడ్డాయి. బురదలో కూరుకుపోయి కొన్ని... బోటు రేకులకు పట్టుకుని కొన్ని మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ బోట్ ఏసీ కేబిన్‌లో ఉన్నవే. బోట్ గల్లంతు అయిన రోజునే గల్లంతు అయిన వాళ్లంతా ఏసీ కేబిన్లలో ఉండి ఉంటారని అనుమానించారు. దానికి తగ్గటుగానే కొన్ని మృతదేహాలు అందులో చిక్కుకుని ఉన్నాయి. ఇవి ఎవరివో గుర్తించాల్సి ఉంది. గల్లంతు అయిన వారిలో 12 మంది జాడ తెలియాల్సి ఉండగా.... ఇప్పటికి 8 బయటపడటంతో మిగిలిన నలుగురు జాడ కోసం బోటు ఉన్న ప్రాంతంలోనే గాలిస్తున్నారు.