పెళ్లింట విషాదం.. 8 మంది మృతి..

పెళ్లింట విషాదం.. 8 మంది మృతి..

రోడ్డు ప్రమాదం పెళ్లి జరుగుతోన్న ఓ ఇంట్లో తీవ్ర విషాధాన్ని నింపింది... వివారాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్-ఆగ్రా నేషనల్ హైవేపై లెహ్రాన్ దగ్గర పాల లారీ ఒకటి ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా... ఆస్పత్రికి తరలిస్తుండగా... మరో ఇద్దరు మృతిచెందారు. మొత్తం ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా... 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా కోత్వాలీ ప్రాంతంలోని దల్‌వాల్ గ్రామస్తులు. ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్నవాళ్లంతా మాక్రెహాటాలో జరగనున్న ఓ వివాహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో పెళ్లిఇంట విషాదం నెలకొంది.