8 మంది డకౌట్‌...

8 మంది డకౌట్‌...

ఓ క్రికెట్ మ్యాచ్ లో ఏకంగా ఎనిమిది మంది డకౌట్‌ అయ్యారు. అండర్‌-19 మహిళల టీ-20 టోర్నీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రా, సిక్కిం జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 208 పరుగుల భారీ లక్ష ఛేదనలో సిక్కిం జట్టు కేవలం 8 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. సిక్కిం జట్టులో ప్రీతిక (5), అర్చన (1)లు మాత్రమే పరుగుల ఖాతా తెరిచారు. మరో రెండు పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. ఆంధ్ర పేస్ బౌలర్ సాయిలక్ష్మి 6 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసింది. సాయిలక్ష్మి ఒకే ఓవర్లో 4 వికెట్లు తీసుకుంది. సింధుజ 1 పరుగు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అయితే గాయం కారణంగా ఒక క్రీడాకారిణి బ్యాటింగ్‌కు రాలేదు. 199  పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆంధ్రా జట్టు తర్వాతి రౌండుకు అర్హత సాధించింది.