ఇండియా మ్యాచ్‌లో సందడి చేసి బామ్మ..!

ఇండియా మ్యాచ్‌లో సందడి చేసి బామ్మ..!

ప్రపంచకప్‌ లీగ్‌ దశలో భాగంగా ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ బామ్మ ప్రత్యేక ఆకర్షణగా మారింది. స్టేడియంలోని కుర్ర ఫ్యాన్స్‌కు దీటుగా సందడి చేసిన ఈ బామ్మ 'ఫ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచింది. 87 ఏళ్ల వయసులోనూ 8 గంటలపాటు స్టేడియంలో అలసట లేకుండా సందడి చేసిన ఈ బామ్మ పేరు చారులత పటేల్‌. ప్రస్తుతం బ్రిటన్‌లో నివాసం ఉంటున్న ఈమె.. కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ బామ్మగారి జోష్‌కు కామెంటేటర్లతోపాటు కోహ్లీ, రోహిత్‌ శర్మలు కూడా ఫిదా అయ్యారు. మ్యాచ్‌ ముగిశాక వారిద్దరూ బామ్మ వద్దకెళ్లి కాసేపు ముచ్చటించారు. కోహ్లీ, రోహిత్‌లను ఆశీర్వదించి.. ఆప్యాయంగా ముద్దులు పెట్టిందా బామ్మ. మరో విశేషమేంటంటే..1983లో  లార్డ్స్‌లో భారత జట్టు ప్రపంచ కప్‌ గెలిచినప్పుడు ఈ బామ్మగారు ప్రత్యక్షంగా వీక్షించారట.