బాలుడిని బలితీసుకున్న లిఫ్ట్

బాలుడిని బలితీసుకున్న లిఫ్ట్

ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు లిఫ్ట్ కింద పడి చనిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. నగరంలోని రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్‌ నెంబర్‌ 10, టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ధనుష్‌ అనే ఓ బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్‌ కింద పడి చనిపోయాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ధనుష్‌ కుటుంబం రెండు నెలల క్రితమే ఈ అపార్ట్‌మెంట్‌ లోకి వచ్చి చేరినట్టు సమాచారం.