96 రీమేక్ కన్ఫార్మ్

96 రీమేక్ కన్ఫార్మ్

విజయ్ సేతుపతి, త్రిషా జంటగా నటించిన 96 సినిమా అక్టోబర్ 4 న బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా రిలీజ్ కాకముందే, దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.  96 తెలుగు రైట్స్ ను దిల్ రాజు తీసుకున్నారు.  ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయకుండా.. రీమేక్ చేయాలని అనుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి.  ఈ వార్తలను కన్ఫర్మ్ చేస్తూ దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు.  ఇందులో స్టార్స్ ఎవరు, సాంకేతిక వర్గం ఎవరనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారని దిల్ రాజ్ పేర్కొన్నారు.