సమంత, శర్వానంద్ జోడీగా !

సమంత, శర్వానంద్ జోడీగా !

గత ఏడాది అక్టోబర్లో విడుదలైన తమిళ చిత్రం '96' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాను ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు.  ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయనున్నారు.  ఇందులో త్రిష స్థానంలో సమంత, విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్ నటించనున్నారు.  ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు.  మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మించనున్నాడు.