రెండు వారాల్లో 97వేల మంది పిల్లలకు కరోనా..!

  రెండు వారాల్లో 97వేల మంది పిల్లలకు  కరోనా..!

ఓ వైపు దేశంలో కరోనా విజృంభణ చేస్తుంటే అమెరికా పాఠశాలలను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా ఉదృతి మధ్య  పాఠశాలలు ప్రారంభించడంతో జూలై చివరి రెండు వారాల్లోనే 97,000 మందికి పైగా పిల్లలు కరోనా బారిన పడ్డారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ నివేదికల ప్రకారం....పాఠశాలలను తిరిగి ప్రారంభించిన తరువాత దాదాపు 97,000 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కొలరాడో లోని పీడియాట్రిక్ అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ సీన్ ఓ లియరీ పిల్లలు వైరస్ బారిన పడవచ్చు మరియు వారి ద్వారా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పాఠశాలలను తిరిగి తెరవాలని అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి చేశారని అన్నారు. కరోనా ప్రారంభం నుండి మొత్తం 3,40,000 మంది పిల్లలు కరోనావైరస్ బారినపడినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా భారత్ లో తల్లిదండ్రులు కరోనా సమయంలో పాఠశాలలను తిరిగి తెరవడానికి నిరాశవ్యక్తం చేస్తున్నారు.