స్కూల్ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి..

స్కూల్ భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి..

హైదరాబాద్‌ నాగోల్‌లో విషాదం జరిగింది... నాగోల్‌లోని సాయినగర్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థిని వినీత.. ప్రమాదవశాత్తు స్కూల్ భవనం మూడో అంతస్తు నుంచి పడిపోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది వినీతను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే లోపే వినీత మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. స్కూల్ రీపోన్ అయిన రెండో రోజూ ఈ ఘటన చోటు చేసుకుంది... సాయినగర్‌లోని నాగార్జున స్కూలో ఈ ఘటన జరిగింది. చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుతోంది. దీనికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అంటున్నారు విద్యార్థిని కుటుంబసభ్యులు... కనీసం పై అంతస్తులకు సరైన రీతిలో ప్రహారిగోడ లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.