కాసేపట్లో ప్రధానిని కలవనున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి..!

కాసేపట్లో ప్రధానిని కలవనున్న అశోక్‌ గజపతి రాజు, సుజనా చౌదరి..!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాల‌ని, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ.. ఏపీ ఎంపీల డిమాండ్లపై ఢిల్లీలో రసవత్తర రాజకీయం చోటుచేసుకుంటుంది. ఉద్యమం ఉధృతం అవుతున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ పై మ‌రోసారి నీళ్లు చ‌ల్లారు. దీంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ఆదేశాల మేర‌కు త‌మ కేంద్ర మంత్రి ప‌దవుల‌కు రాజీనామా చేయాల‌ని నిర్ణయించుకున్నట్లు అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రి రాజీనామా లేఖ‌లు సిద్ధం చేసుకున్నారు కూడాను.

కాగా ఇప్పటికే వారు ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. కాసేప‌ట్లో వారు మోడీని క‌ల‌వ‌నున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరితం సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.