భార్య కోసం బోనికపూర్ ఏం చేశాడో తెలుసా..?

భార్య కోసం బోనికపూర్ ఏం చేశాడో తెలుసా..?

ఇండియన్ సినిమా చరిత్రలో శ్రీదేవికి ఎంత పేరు ఉందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  శ్రీదేవిని ఆరాధించే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు.  అంతమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి, రెండు నెలల క్రితం అనుకోకుండా ప్రాణాలు అదిలి కోట్లాదిమందిని శోకసంద్రంలో పడేసింది.  ఆమెకోసం అభిమానులు చాలారోజులు బాధపడ్డారు.  మరణించిన వారు తిరిగిరారు కదా... అభిమానాన్ని గుండెల్లో దాచుకొని రోజువారి పనుల్లో మునిగిపోయారు.  అభిమానులకే అంతటి అభిమానం ఉంటె.. పాతిక సంవత్సరాలుగా ఆమెతో కలిసి ఉన్న భర్త బోనికపూర్ పరిస్థితి ఇంకెలా ఉంటుంది.  ఆమె లేదన్న విషయాన్ని బోనికపూర్ ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు.  భార్యపై ఉన్న ప్రేమను అయన ఎలా చూపించబోతున్నారు.. అనే డౌట్స్ సగటు అభిమానులు రావొచ్చు.  స్వతహాగా నిర్మాతైనా బోనికపూర్, తన భార్యపైనే ఓ బయోపిక్ చేయాలని అనుకుంటున్నారట.  

ఈ బయోపిక్ కోసం బోనికపూర్ పెద్ద హోమ్ వర్కే చేస్తున్నాడు.  సినిమా కోసం ఇప్పటికే 20 టైటిల్స్ ను రిజిస్టర్ చేయించినట్టు సమాచారం.  శ్రీ, శ్రీదేవి, శ్రీ మేడం అనే టైటిల్స్ ను ఇప్పటికే రిజిస్టర్ చేయించాడు.  శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రాలైన చాలా బాజ్, రూప్ కి చోరన్ కా రాజా, జాన్ బాజ్, మిస్టర్ ఇండియా వంటి టైటిల్స్ ను కూడా రిజిస్టర్ చేయించాడట బోనికపూర్.  అంతేకాదు, మిస్టర్ ఇండియా సినిమాకు సీక్వెల్ గా చేయాలి అనుకున్న రిటర్న్ ఆఫ్ మిస్టర్ ఇండియా అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.  వీటితో పాటు శ్రీదేవి నటించిన అన్ని చిత్రాల హక్కుల్ని బోనికపూర్ దక్కించుకున్నట్టు సమాచారం. భార్యపై ఉన్న ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి.  ఇప్పటివరకు ఎవరు చేయని పనిని బోనికపూర్ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.