పెళ్లి కావాలంటే ఇలా పట్టుకోండి..!!

పెళ్లి కావాలంటే ఇలా పట్టుకోండి..!!
ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విషయం అతని చేయి పట్టుకు చూస్తే అర్ధం అవుతుంది.  నాడిని పరీక్షించవలసిన అవసరం కూడా లేదు.  చేయి పట్టుకొని చెప్పెయ్యవచ్చు. ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే కాకుండా, పెళ్లయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా చేయి పట్టుకొని చెప్పెయ్యవచ్చని అంటున్నారు కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు.  
చేతి పట్టు ఎంత బలంగా ఉంటె అంత ఆరోగ్యం.  అలాగే చేతి పట్టు బలంగా ఉంటె పెళ్లయ్యే అవకాశాలు కూడా అంత ఎక్కువగా ఉంటాయట.  గట్టిగా బలంగా చేయి పట్టుకునే పురుషుడినే మహిళలు ఎక్కువగా ఇష్టపడతారట.  అలాంటి వ్యక్తులని వివాహం చేసుకోవడానికి మహిళలు ఆసక్తి చూపుతారని పరిశోధకుల పరిశోధనలో తేలింది.