లాభాలతో ముగిసిన మార్కెట్లు

లాభాలతో ముగిసిన మార్కెట్లు

అన్ని రంగాల షేర్లకు మద్దతు అందడంతో స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇన్వెస్టర్లకు గట్టి మద్దతు లభిస్తోంది. రియాల్టి, ఐటీతో పాటు ఎఫ్‌ఎంసీజీ కౌంటర్లలో కొనుగోళ్ళు కొనసాగాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 47 పాయింట్ల లాభంతో 10,739 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 190 లాభపడింది. బీఎస్ఈలో ఇండియా బుల్స్ వెంచర్స్ (పీపీ) పది శాతం, రెప్కో 8 శాతం చొప్పున లాభపడ్డాయి. ఇండియా బుల్స్ రియల్‌ ఎస్టేట్, ఇండియా బుల్స్ వెంచర్స్, గతి షేర్లు ఏడు శాతంపైగా లాభపడ్డాయి. ప్రతికూల వార్తల నేపథ్యంలో పీఎస్‌ఈ జ్యువల్లర్స్  ఇవాళ ఏకంగా 18 శాతంపైగా నష్టపోయింది. ఇక ఎన్‌ఎస్ఈలో లాభపడిన నిఫ్టి షేర్లలో ఎస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, కొటక్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌, ఎల్‌ అండ్‌ టీ ఉన్నాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్‌, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు ఉన్నాయి.