ఆ రాతలపై విచారణకు ఆదేశం...

ఆ రాతలపై విచారణకు ఆదేశం...

మధ్యప్రదేశ్ లో కానిస్టేబుల్ పరీక్షా విధానం వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సందర్భంగా.. వైద్యుల సమక్షంలో శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం కొంతమంది శరీరంపై ఎస్సి, ఎస్టీ అని మార్క్ వేశారు. ఎస్సి, ఎస్టీలకు మాత్రమే ఇలా మార్కులు వేయడం వివాదానికి దారితీసింది. జనరల్ అభ్యర్థుల నుంచి విడిగా గుర్తించేందుకు ఇలా  చేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు.

అయితే ఈ ఘటనపై ధార్ సూపరింటెండెంట్ బిరేంద్ర కుమార్ సింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. శరీరంపై క్యాస్ట్ మార్క్ వేయాలని ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. దోషిగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపాడు. స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) రిషి కుమార్ శుక్లా మాట్లాడుతూ.. ఈ చర్యలో ఎటువంటి చెడు ఉద్దేశ్యం లేదని అన్నారు.