మహేష్ ఇచ్చిన భారీ గిఫ్ట్ ఇదేనా..?

మహేష్ ఇచ్చిన భారీ గిఫ్ట్ ఇదేనా..?

భారీ ప్లాప్ తరువాత మంచి హిట్ సినిమా పడితే ఆ హీరో ఆనందం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.  అదే వరసగా రెండు ప్లాప్ లు వచ్చాక హిట్ పడితే.. ఇక ఆనందానికి హద్దులు ఉంటాయా చెప్పండి.  తన ఆనందాన్ని బహుమతుల రూపంలో పనిచేస్తుంటారు.  సినిమా మంచి హిట్ అయితే యూనిట్ కు బహుమతులు ఇచ్చే వారిలో మహేష్ బాబు ముందు ఉంటాడు.   శ్రీమంతుడు సమయంలో కొరటాలకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చాడు.  ఆ తరువాత వరసగా రెండు భారీ ప్లాప్ లు వచ్చాయి.  

మరలా శ్రీమంతుడు దర్శకుడితో భరత్ అనే నేను చేశాడు.  సినిమాపై మొదటి నుంచి మంచి హోప్స్ ఉన్నాయి.  అనుకున్నట్టుగానే సినిమా సూపర్ హిట్ అయింది.  ఇంకేమున్నది భరత్ టీమ్ కి ఖరీదైన ఫోన్లు బహుమతిగా ఇచ్చాడు మహేష్.  శ్రీమంతుడు సినిమాకే ఖరీదైన కారును బహుమతిగా ఇస్తే.. భరత్ కు ఇంకెలాంటి గిఫ్ట్ ఇస్తాడో అని అందరు ఎదురు చూశారు.  కానీ మహేష్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నాడు.  కొరటాలకు ఇచ్చే గిఫ్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు మహేష్.  కారణం ఏంటో కూడా తెలియడం లేదు.  ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మహేష్ ఇప్పటికే కొరటాలకు భారీ గిఫ్ట్ ఇచ్చాడని.. దానిని బయటకు చెప్పడం ఇష్టం లేకనే సీక్రెట్ గా ఉంచారని టాక్. బయటకు చెప్పనంత పెద్ద గిఫ్ట్ ఏమి ఇచ్చి ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు.