మహేష్ సినిమా.. అమెరికా నుంచి మొదలు

మహేష్ సినిమా.. అమెరికా నుంచి మొదలు
మహేష్ "భరత్ అనే నేను" సూపర్ హిట్ అయింది. ఊహించిన దానికంటే భారీ స్థాయిలో వసూళ్లు వస్తుండటంతో.. భరత్ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది.  రెండు ప్లాప్ ల తరువాత వచ్చిన హిట్ కావడంతో మహేష్ కూడా ఈ హిట్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు వెకేషన్ ఉన్నారు.  
ఇక ఇదిలా ఉంటె, మహేష్ నెక్స్ట్ మూవీ కోసం ఇప్పటికే రంగం సిద్ధం అయింది.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం చెకచెక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.  మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా లొకేషన్లను వెతికే పనిలో పడ్డాడు వంశి.  ఈ సినిమా చాలాభాగం అమెరికా నేపథ్యంలో ఉండబోతుండటంతో.. ఎక్కువభాగం సినిమాను అమెరికాలోనే షూట్ చేయబోతున్నారు.  న్యూయార్క్ లోని అందమైన లొకేషన్స్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడు వంశి.  మహేష్ బాబు వెకేషన్ పూర్తికాగానే మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో ఈ సినిమాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.