కసరత్తులు మొదలెట్టిన చరణ్

కసరత్తులు మొదలెట్టిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ జిమ్ బాటపట్టి కసరత్తులు మొదలెట్టాడు. కారణం..బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసమే. మొన్నొచ్చిన రంగస్థలం చిత్రంలో సాదాసీదాగా కనిపించిన చరణ్..ఈ కొత్త సినిమాలో మాత్రం సరికొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు. ఇందుకోసం కండలు కూడా పెంచుతున్నాడు. ప్రఖ్యాత జిమ్ ట్రైనర్ రాకేష్ ఉడయార్ పర్యవేక్షణలో ఆహారనియమాలు, జిమ్ వర్క్ ఔట్స్ జరుగుతున్నాయి.

ఈ ట్రైనర్ ను బాలీవుడ్ అగ్రకథానాయకుడు సల్మాన్ ఖాన్ సలహా మేరకు నియమించుకున్నాడట. ధృవ సినిమా కోసం చరణ్ టోటల్ గా తన మేకోవర్ ని మార్చుకోవడంలోను ఈ ట్రైనర్ రాకేష్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు చేయనున్న బోయపాటి సినిమాలో చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండటంతో తిరిగి బాడీని షేప్ లో పెట్టె పనిలో పడ్డాడు. ఇలా రామ్ చరణ్ మళ్ళీ కష్టపడుతున్నాడని..భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మొదటి సారి బోయపాటి, రామ్ చరణ్ ల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా, డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.

https://twitter.com/upasanakonidela/status/990804414301532160