ఓపెనింగ్‌లో ఆకర్షణీయ లాభాలు...

ఓపెనింగ్‌లో ఆకర్షణీయ లాభాలు...

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐటీ షేర్ల అండతో సూచీలు ఓపెనింగ్‌లోనే ఆకర్షణీయ లాభాలు గడించాయి. శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్‌కు ఇవాళ కూడా అధిక స్థాయిలో మద్దతు అందుతోంది. అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిసిన ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ అరశాతంపైన, హాంగ్‌కాంగ్‌ ఒకటిన్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి ప్రస్తుతం 10750 వద్ద 58 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి షేర్లలో ఎస్‌బీఐ రెండు శాతం పైగా లాభంతో టాప్‌లో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ తరవాత హెచ్‌సీఎల్‌ టెక్, బీపీసెల్‌ కొటక్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇక నష్టాలు పొందిన నిఫ్టి షేర్లలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఉంది. శుక్రవారం పది శాతం వరకు లాభపడిన ఈ కౌంటర్లో లాభాల స్వీకరణ కన్పిస్తోంది. రిలయన్స్ లో కూడా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఫలితాలను మార్కెట్ ఇది వరకే డిస్కౌంట్‌ చేసినట్లు కన్పిస్తోంది. లాభాలు నష్టాలు స్వల్పంగా ఉండటం, అధికస్థాయిలో లాభాల స్వీకరణకు ఆస్కారం ఉండటంతో నిఫ్టి 10750 పైన నిలదొక్కుతుందా అన్నది అనుమానంగా ఉంది. మిడ్ సెషన్‌ తరవాత దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.