కిచ్చ ఎంత అదృష్టవంతుడంటే..!!

కిచ్చ ఎంత అదృష్టవంతుడంటే..!!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను కాంబినేషన్లో  భారీ యాక్షన్ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ మూవీలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, మహేష్ మంజ్రేకర్, వివేక్ ఒబెరాయ్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో అగ్రనటుడు కూడా నటిస్తున్నాడట. రాజమౌళి ఈగ సినిమాలో విలన్ పాత్రతో అందరిని ఆకట్టుకున్న కిచ్చ సుదీప్ ఈ యాక్షన్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర వర్గాలు చెప్తున్నాయి.  కథ నచ్చడంతో.. సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.  మరోవైపు మెగాస్టార్ కథానాయకుడిగా రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమాలో కూడా కిచ్చ కీలకపాత్ర చేస్తున్నారు.  తండ్రి మెగాస్టార్ తోను, కొడుకు మెగా పవర్ స్టార్ తోను నటించే అవకాశం కొట్టేశాడు సుదీప్.  రెండు సినిమాలు భారీ నిర్మాణంతో నిర్మిస్తున్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏ సినిమా హిట్ అయినా.. ఈ కన్నడ స్టార్ కు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.  ఈ విధంగా చూసుకుంటే.. కిచ్చ నిజంగా అదృష్టవంతుడనే చూపొచ్చు.