జంక్ ఫుడ్డు కూడా ఆరోగ్యమే..!!

జంక్ ఫుడ్డు కూడా ఆరోగ్యమే..!!
కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకుంటే శరీరంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలిసిందే.  కొంతమంది మామూలు ఆహారం తీసుకున్నా శరీరంలో కొవ్వు పేరుకుపోయి.. ఇబ్బంది పడుతుంటారు.  జంక్ ఫుడ్ తీసుకునే వారికి బౌల్ క్లీన్ సమస్య ఎక్కువగా ఉంటుంది.  అందుకే వీరు వాటి జోలికి వెళ్లకుండా వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.  
కొవ్వు అధికంగా ఉండే బీఫ్, పంది మాంసం వంటివి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, పేగు క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమౌతాయని భయపడుతుంటారు.  కానీ, ఈ వెస్టర్న్ ఫుడ్ కూడా ఆరోగ్యమే అంటున్నారు మిడ్ వెస్టర్న్ వర్సిటీ శాస్త్రవేత్తలు.  కొవ్వు అధికంగా ఉండి, చెక్కర తక్కువగా ఉండే పదార్ధాలను ఆహారంగా తీసుకోవచ్చట.  ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే.. చిన్నపేగులో కొవ్వును కరిగించే బ్యాక్టీరియా వృద్ధి చెంది.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.  తద్వారా బౌల్ క్లీన్ ఈజీగా జరుగుతుంది.  మలబద్దకం సమస్య నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.