'ఏ' సర్టిఫికెట్ పొందిన సమంత సినిమా !

'ఏ' సర్టిఫికెట్ పొందిన సమంత సినిమా !

 

తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్ సమంత.  ఈ ఏడాది ఆమె నుండి మూడు సినిమాలు రానున్నాయి.  వాటిలో తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్' కూడా ఒకటి.  ఈ నెల 29న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని ముగించుకుంది.  సెన్సార్ బోర్డు చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది.   త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించగా రమ్యకృష్ణ కూడా బోల్డ్ పాత్రలో కనిపించనుంది.