ముంబైలో అడ్డుగోడ..

ముంబైలో  అడ్డుగోడ..

ఒక్క ఫొటో వెయ్యి మాటల కన్నా శక్తిమంతమైందనే విషయం ఈ ఫొటో చూస్తే మరోసారి గుర్తుకొస్తుంది. ముంబైలోని మురికివాడలు, వాటి ఆవల ధనవంతుల ఆకాశ హర్మ్యాలు ఒకే చిత్రంలో కొట్టొచ్చినట్టు కనిపించడమే ఈ ఇమేజ్ లోని ప్రత్యేకత. డ్రోన్స్ ఉపయోగించి అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీస్తున్న ఓ ప్రైవేటు సంస్థ "పిక్సెల్ డు డాట్ కామ్" ఈ ఫొటో తీసింది. 

ఆ ఇమేజ్ చెబుతున్న కళ్లకు కట్టే వాస్తవాన్ని ప్రపంచానికి చాటాలనుకున్న ప్రాంశు దూబే అనే నెటిజన్.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు బాగా రెస్పాండ్ అవుతున్నారు. అద్భుతంగా కనిపించే ప్రపంచానికి రెండో వైపున ఉండే మురికివాడలు, వాటిని పట్టించుకోని పాలకులు, సోషలిస్టు సమాజం, పెట్టుబడిదారీ సమాజం వంటి అనేక భావాలపై అద్భుతంగా చర్చ జరుపుతున్నారు. ఆ చర్చ ద్వారా తెలిసిందేమంటే అది ధారవిలోని మురికివాడల ఫొటో కాదని, విఖ్రోలీ లోని స్లమ్ ఏరియా అని.