వైరల్: సీన్ రివర్స్... పామును తినేసిన కప్ప...
కొన్నిసార్లు బలహీనమైన జంతువులు బలంగా మారిపోయి శత్రువులపై పోరాటం చేస్తుంటాయి. అవసరమైతే చంపేసి తినేస్తాయి కూడా. పాము... కప్ప ఇద్దరు కూడా బద్ద శతృవులు. కప్ప కనిపిస్తే చాలు పాము పారిపోతుంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇక పాము కనిపిస్తే కంటపడకుండా తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుంది. అయితే, ఓ కప్ప మాత్రం అందుకు విరుద్ధంగా పాముతో ఫైట్ చేసింది. దాన్ని ఓడించి తినేసింది. గ్రీన్ ట్రీ ఫ్రాగ్ లు సహజంగా పురుగులను తిని జీవనం సాగిస్తుంటాయి. ఒక్కోసారి ఆ కప్పలు కీటకాలతో పాటుగా ఎలుకలు, గబ్బిలాలను కూడా తినేస్తాయట. ఇప్పుడు ఈ కప్ప మరో అడుగు ముందుకు వేసి ఏకంగా పామును తినేసింది. దీనికి సంబంధించిన చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)