హైదరాబాద్ లో మరోదారుణం: నగ్నంగా డ్యాన్స్ చేయాలని మహిళకు బెదిరింపు... వినకపోవడంతో... 

హైదరాబాద్ లో మరోదారుణం: నగ్నంగా డ్యాన్స్ చేయాలని మహిళకు బెదిరింపు... వినకపోవడంతో... 

హైదరాబాద్ లో మహిళలకు రక్షణ కరువైంది.  మహిళలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు.  బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు మరొక భయం.  ప్రతి నిమిషం భయం భయంగా గడపాల్సిన పరిస్థితి వస్తుంది.  ఇలాంటి భయాందోళన మధ్య మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.  వీలైనంతగా సంపాదిస్తున్నారు.  సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. ఏదైనా కావొచ్చు బిజినెస్ బిజినెస్ కాబట్టి ఈ విషయంలో భయపడకుండా చేసుకుంటున్నారు.  

ఇలానే ఓ మహిళ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తోంది.  ఈనెల 22 వ తేదీన మహిళా ఓ వ్యక్తి పుట్టినరోజుకు సంబంధించిన ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది.  ఆ పార్టీలో యువకులు మద్యం సేవించి ఆ మహిళపై విరుచుకుపడ్డారు.  నగ్నంగా డ్యాన్స్ చేయాలనీ ఫోర్స్ చేశారు.  చేయకుంటే చంపేస్తామని బెదిరించారు.  రాత్రి మొత్తం రూమ్ లో బందించి వేధించారు.  అయితే, ఆ మహిళా ఎలాగోలా తప్పించుకొని భర్త దగ్గరకు వచ్చింది.  అసలు విషయం చెప్పడంతో పోలీసులను సంప్రదించారు.  కేసు నమోదు చేశారు.  పుట్టినరోజునాడు హంగామా చేసిన ఆ నలుగురు యువకులు పరారీలో ఉన్నట్టుగా సమాచారం.