నవాజ్ రాకతో... లాహోర్ జనసంద్రం...

నవాజ్ రాకతో... లాహోర్ జనసంద్రం...

అక్రమంగా ఆస్తులను కూడబెట్టి, లండన్ లో అత్యంత ఖరీదైన హైడ్ పార్క్ ప్రాంతంలో మూడు ఫ్లాట్లు కొనుగోలు చేసిన నేరంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తన కూతురితో కలిసి స్వదేశానికి వస్తున్న నవాజ్ షరీఫ్ కు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు లాహోర్ విమానాశ్రయానికి ర్యాలీగా బయలుదేరారు. దీంతో లాహోర్ వీధులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. వేలాది మంది తమ పార్టీ కార్యకర్తలు లాహోర్‌కు రాకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. అనేక చోట్ల పోలీసుల వైఖరిని, ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకారులు వీధుల్లో ప్రదర్శనలు చేశారు.