హైదరాబాద్‌లో దారుణం...తాగిన మైకంలో భార్య గొంతు నులిమి చంపిన భర్త

హైదరాబాద్‌లో దారుణం...తాగిన మైకంలో భార్య గొంతు నులిమి చంపిన భర్త

రాజేంద్రనగర్ హైదర్ గూడాలో‌దారుణం చోటుచేసుకుంది. భార్య గొంతు నులిమి చంపేశాడు భర్త.  స్థానికుల‌ సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన తల్లిని సరిగ్గా చూసుకోవడం లేదనే కారణంతో భార్య సమంతను భర్త రవి  హత్య చేసాడు. అర్ధరాత్రి ఇద్దరి మధ్య చెలరేగింది వివాదం. తాగిన మైకంలో భార్య సమంత పై దాడిచేయడమే కాకుండా క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపాడు భర్త రవి. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. దంపతుల స్వస్థలం అసిఫాబాద్ జిల్లా మంచిర్యాల గ్రామంగా పోలీసులు గుర్తించారు.