సినీ ఫక్కీ లో కిడ్నాప్...టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకుపై కేసు
బంజారాహిల్స్ లోని సినీ ఫక్కీ లో నిన్న రాత్రి కిడ్నాప్ కలకలం రేపింది. నగర నడిబొడ్డున టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డి హల్చల్ చేశారు. డిస్ట్రీబ్యూటర్ శివ గణేష్ ను సినీ ఫక్కీలో కొండారెడ్డి గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. కడప జిల్లా టీడీపీ నేత వరద రాజు కొడుకు కొండా రెడ్డి అతని అనుచరుల వీరంగం సృష్టించారు. తుపాకులు, కత్తులు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు రాయలసీమ రౌడీలు. శామీర్‌పేట్, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలపై రౌడీ మూకలు సంతకాలు చేయించుకున్నారు. దీంతో బాధితుడు ప్రొడ్యూసర్ శివ గణేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
అతని ఫిర్యాదు మేరకు కొండా రెడ్డితో పాటు రౌడీ గ్యాంగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం శ్రీనగర్ కాలనీలోని శివగణేశ్ ఇంటికి బంజారాహిల్స్ పోలీసులు వచ్చారు. ఈ సందర్భంగా...బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. శివ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారుంటూ కొండారెడ్డి తో పాటు మరో పదిమందిపై ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. తుపాకులతో బెదిరించాడన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని..ఈ కేసులో మొత్తం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏసీపీ శ్రీనివాస్‌రావు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)