లక్ అంటే ఇదే: అతను కొన్న 25 లాటరీ టికెట్లకు ప్రైజ్ వచ్చింది... ఎంతో తెలుసా? 

లక్ అంటే ఇదే: అతను కొన్న 25 లాటరీ టికెట్లకు ప్రైజ్ వచ్చింది... ఎంతో తెలుసా? 

మీరెప్పుడైనా లాటరీ టికెట్ కొన్నారా ... కొంటె ఎప్పుడైనా లాటరీ తగిలిందా అంటే లేదనే చెప్తారు.  ఒకవేళ లాటరీ వచ్చినా ఒకేసారి లేదంటే రెండుసార్లు లాటరీ వస్తుంది అనుకోవచ్చు.  ఒకేసారి గెలిస్తే అదృష్టం అనుకోవచ్చు... రెండుసార్లు గెలిస్తే లక్ అనుకోవచ్చు.  అలా కాకుండా కొనుగోలు చేసిన టికెట్స్ అన్నింటికీ లాటరీ తగిల్తే ఏమనాలి... ఏమనాలో కూడా చెప్పలేం.  

అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో నివసించే రేమండ్ హరింగ్టన్ అనే వ్యక్తి వర్జీనియా బీచ్ లో వెళ్తుండగా లాటరీ షాప్ కనిపించింది.  సరదాగా 25 డాలర్లు పెట్టి 25 లాటరీ టిక్కెట్స్ కొనుగోలు చేశాడు.  అదృష్టం ఏమిటంటే కొన్న 25 టికెట్స్ కు లాటరీ తగిలింది.  ఒక్కో టిక్కెట్ కు 5వేల డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది.  25 టిక్కెట్స్ కు కలిపి 1,25,000 డాలర్లు ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.  వచ్చిన డబ్బుతో తన కొడుకును బాగా చదివిస్తానని అంటున్నాడు రేమండ్.