వైరల్ః కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. 

వైరల్ః కదిలే రైలు ఎక్కబోయి జారిపడ్డాడు.. 

ఒడిశాలోని జార్షుగూడ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కదిలే రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారిపడి.. మృత్యువు అంచు వరకు వెళ్లి మరి సురక్షితంగా బయటపడ్డాడు. ఒడిశాలోని జొహర్సగుడా రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. రాజేష్‌ తల్వార్‌ అనే వ్యక్తి  హౌరా నుంచి సంబల్‌పూర్‌ వైపు వెళ్తున్న సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. రైలు ఒడిశాలోని జార్షుగూడ రైల్వే స్టేషన్‌లో ఆగడంతో రాజేష్‌ టీ తాగేందుకు రైలు దిగాడు. టీ తీసుకునే వచ్చేలోపే రైలు కదలడంతో ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో కాలు జారి రైలు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని ప్రయాణికులు రాజేష్‌ను రక్షించేందుకు ప్రయత్నించేలోపే అతను కిందకు పడిపోయాడు. రైలు కొంతదూరం రాజేష్‌ను లాక్కెళ్లగా.. అది చూసిన కొందరు రైలును ఆపారు. రైల్వే భద్రతా దళం వెంటనే రాజేష్‌ను బయటకు తీసింది. ఈ ఘటనలో రాజేష్‌ స్వల్పంగా గాయపడ్డాడు.