పసికందును నేలకేసి కొట్టిన తల్లి

పసికందును నేలకేసి కొట్టిన తల్లి

బిడ్డ తనకు పుట్టలేదంటూ భర్త ఘర్షణకు దిగడంతో పసికందును ఓ తల్లి నేలకేసి కొట్టింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంలో చోటుచేసుకుంది. చిన్నారి తనకు పుట్టలేదని రోజు భర్త గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి మెహిదీపట్నంలోని చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతంలో ఇద్దరు దంపతులు రోడ్డుపైనే గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన తల్లి పసికందును నేలకేసి కొట్టింది. ఇది గమనించిన చుట్టుపక్కన వారు, ఓ ట్రాఫిక్ పోలీస్ చిన్నారిని తండ్రికి అప్పగించి వారిని అక్కడి నుండి పంపించేశారు. అయితే వారి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.