విజయవాడ గ్యాంగ్ వార్ లో కొత్త కోణం..కీలక విషయాలు వెలుగులోకి...!

విజయవాడ గ్యాంగ్ వార్ లో కొత్త కోణం..కీలక విషయాలు వెలుగులోకి...!

విజయవాడలో జరిగిన గ్యాంగ్‌ వార్‌కు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘర్షణలో పాల్గొన్న తోట సందీప్‌, కేటీఎం పండు గ్రూపుల మధ్య భూ వివాదాలతోపాటుగా, వ్యక్తిగత పోరు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. తొలుత సందీప్‌, పండులు సన్నిహితులైనప్పటికీ విబేధాలు తలెత్తటంతో రెండు గ్యాంగ్‌లుగా విడిపోయారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో సందీప్‌, పండు వర్గాల జోక్యం ఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. బెజవాడలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లకు గుంటూరు నుంచి యువకులను, గుంటూరులో ల్యాండ్‌ సెటిల్‌మెంట్లకు బెజవాడ యువకులను తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.

 ఇలా చేయడం ద్వారా బయటి వ్యక్తులను గుర్తుపట్టే అవకాశం ఉండదని వారు భావించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాంగ్‌ వార్‌లో రెండు జిల్లాలకు చెందిన వారు పాల్గొన్నట్టుగా ఆధారాలు సేకరించారు. అలాగే సందీప్‌, పండులిద్దరికి టిక్‌టాక్‌,ఫేస్ బుక్ లో సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో గ్రూపులు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వీళ్ళను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళను పోలీసులు విచారించే అవకాశం ఉంది. దీని వెనుక రాజకీయ కోణం దాగి ఉందా అనే కోణ్ంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.