ఆస్థి కోసం కొడుకు కిరాతకం 

ఆస్థి కోసం కొడుకు కిరాతకం 

ఆస్థికోసం తల్లిదండ్రులనే ఇంటి నుంచే వెళ్లగొట్టాడు ఓ కసాయి కొడుకు. ఆ వృద్ధులు కష్టపడి కట్టుకున్న ఇంటిని  సైతం కబ్జా చేశాడు.  నెరేడ్మెట్ సాయినాథపురానికి చెందిన రాములు, నరసమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు సతీష్. సతీష్ కి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తల్లి, తండ్రులను వేదించడం మొదలుపెట్టాడు. వారికి తెలియకుండా ఊర్లో ఉన్న పొలాన్ని సైతం  అమ్ముకున్నాడు. తెల్ల కాగితాలపై సంతకం పెట్టాలని తండ్రిని కొట్టేవాడు , అక్కలను సైతం నోటికొచ్చినట్టు తిట్టేవాడు. దీంతో వృద్ధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కష్టపడి కట్టుకున్న ఇల్లు సైతం కబ్జా చేశాడని వాపోతున్నారు. ఇంటి నుంచి గెంటివేయటంతో కూతురు ఇంట్లో తలదాచుకున్నారు ఆ వృద్ధులు. పోలీసులను ఆశ్రయించినా రాజకీయ అండదండలతో వారు పట్టించుకోలేదని వాపోతున్నారు.