సుశాంత్‌కు అరుదైన గౌరవం...

సుశాంత్‌కు అరుదైన గౌరవం...

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి.. బాలీవుడ్‌లో కలకలం రేపింది. అంతేకాదు, అక్కడ జరుగుతున్న చాలా వ్యవహారాలను వెలుగులోకి తీసుకొచ్చింది.  నిజానికి ఒకరకంగా హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి బాలీవుడ్‌ను బాగా బద్నాం చేసింది. నెపొటిజం మొదలు డ్రగ్స్‌ వ్యవహారం వరకు.. చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ దిగ్గజాలుగా చెప్పుకునే చాలామంది పేర్లు కూడా బద్నాం అయ్యాయి. ఇది ఇలా ఉండగా.. సుశాంత్‌ సింగ్‌ మృతిని ఆయన ఫ్యాన్స్‌, కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే...నిన్న అనగా గురువారం రోజు సుశాంత్‌ జయంతి కాగా.. దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రూస్‌ గంజ్‌లో ఉన్న స్ట్రెచ్‌ రోడ్డుకు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డులో ఎక్కువ మంది బీహార్‌ వాసులే నివసిస్తున్నారని... ఇందుకోసం ఆ రోడ్డుకు సుశాంత్‌ పేరు పెట్టాలని సౌత్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభిషేక్‌ దత్‌ గత ఏడాది ప్రస్తావనకు తెచ్చారు. జనవరి 21న అమలులోకి తీసుకువచ్చారు. ఇది సుశాంత్‌కు దక్కిన అరుదైన గౌరవం అని ఆయన అభిమానులు ఆనందిస్తున్నారు.