భారత్ నిధులతో బంగ్లాదేశ్ లో ఆలయ నిర్మాణం... 

భారత్ నిధులతో బంగ్లాదేశ్ లో ఆలయ నిర్మాణం... 

స్వాతంత్య్రానికి పూర్వం బంగ్లాదేశ్ కూడా ఇండియాలో భాగంగానే ఉండేది.  1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది.  ఆ దేశంలో అనేక హిందూ దేవాలయాలు ఉన్న సంగతి తెలిసిందే.  అందులో ఒకటి శ్రీశ్రీ జాయ్ కాళీ మాతర్ ఆలయం.  ఇది నాగోర్ జిల్లాలో ఉన్నది. 300 సంవత్సరాల క్రితం 18 వ శతాబ్దంలో దిఘపతి రాజకుటుంబానికి చెందిన దయారామ్ రాయ్ ఈ దేవాలయాన్ని నిర్మించారు.  అయితే, ఇండియా నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తరువాత ఆ ఆలయాన్ని పట్టించుకోలేదు.  శిథిలావస్థకు చేరుకుంది.  ఈ ఆలయాన్ని ఇప్పుడు తిరిగి పునర్నిర్మిస్తున్నారు.  ఇందుకు భారత్ ఆర్ధికంగా సహాయం చేస్తున్నది.  బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయం ఆలయానికి కావాల్సిన నిధులను బంగ్లాదేశ్ సమాచార మంత్రిత్వశాఖకు అందజేసింది.