దొంగతనానికి వెళ్లి.... ఇంటి యజమానికి లేఖ రాశాడు... ఎందుకంటే... 

దొంగతనానికి వెళ్లి.... ఇంటి యజమానికి లేఖ రాశాడు... ఎందుకంటే... 

దేశంలో మహిళలపై అత్యాచారాలు, దొంగతనాలు ఈ రెండింటిని అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.  అత్యాచారాలు చేసిన నిందితులను పట్టుకున్నా కొన్ని కేసుల్లో మాత్రమే జైలుకు వెళ్తున్నారు శిక్షలు పడుతున్నాయి.  కొన్ని కేసులు తేలడం లేదు.  ఇక దొంగతనం విషయంలో కూడా అంతే జరుగుతున్నది.  కొన్ని సందర్భాల్లో దొంగలు జైలుకు వెళ్లి మరలా తిరిగి వచ్చిన తరువాత వారి వృత్తిని తిరిగి కొనసాగిస్తున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఓ దొంగ ఓ ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు.  అలా దొంగగారు ఆ ఇంటికి వెళ్లి ఇల్లు మొత్తం వెతికాడు.. తనకు కావాల్సిన విలువైన వస్తువు ఏది కూడా అక్కడ కనిపించలేదు.  దీంతో దొంగకు కోపం వచ్చింది.  ఇంటి యజమానిపై తన అసహనాన్ని వ్యక్తం చేయాలని అనుకున్నాడు.  వెంటనే ఇంటి యజమానికి ఓ లెటర్ రాశాడు.  మీరింత పిసినారి అనుకోలేదు.. రాత్రంతా ఇంట్లో విలువైన వస్తువు కోసం వెతికాను.  ఈ రాత్రి సమయం మొత్తం వృధా అయ్యింది.  శ్రమకు తగిన ఫలితం అందలేదు అని చెప్పి లెటర్ రాసి, అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టి వెళ్ళాడు.  మరుసటి రోజు పనిమనిషి ఇంటికి వచ్చినపుడు ఇంటిని చూసి అనుమానం వేసి పోలీసులకు చెప్పింది.  పోలీసులు వచ్చి పరిశీలించిన సమయంలో లెటర్ బయటపడింది.  ఇంటి యజమానికి రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.