వెస్ట్‌బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

వెస్ట్‌బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13మంది మరణించారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లోని జల్పాయిగురి డిస్ట్రిక్ట్ ధుప్‌గురి సిటీలో జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోగ మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గాయాలపాలైన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. ‘పొగమంచు కారణంగా కొంత దూరం వరకే రోడ్డు కనిపిస్తుందని, దాని కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో రోడ్డు సరిగా కనిపించలేదు. దాంతో ఈ ఘోరం జరిగింది. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించాం. వారికి ప్రస్తుతం చికిత్స జరుగుతుంద’ని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మరింత సమాచారం కోసం వేచి చూడాలి.