అప్పు చెల్లించలేదని మహిళను...

అప్పు చెల్లించలేదని మహిళను...

కర్ణాటకలో కొందరు వ్యక్తులు ఓ మహిళపట్ల అనారికంగా వ్యవహరించారు. అప్పు చెల్లించలేదని ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి చెప్పులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. కొడిగేహళ్లిలో రాజమణి అనే మహిళ ఓ వ్యక్తి వద్ద రూ. 50 వేలు అప్పుతీసుకుంది. ఆ డబ్బు తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరుగడంతో సదరు వ్యక్తి మహిళను వేధింపులకు గురిచేశాడు. కరెంటు స్తంభానికి కట్టేసి చెప్పులతో, చీపుర్లతో దాడి చేయించాడు. బాకీ ఎప్పుడు చెల్లిస్తావని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో బయటికి రావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటనలో ప్రమేయమున్న ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.