నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్.!

నెల్లూరులో డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ సూసైడ్.!

నెల్లూరులో ఓ డిగ్రీ విద్యార్థిని సెల్ఫీ వీడియో చిత్రించి ఆత్మహత్య చేసుకుంది.  ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడి వేధింపులే కారణమైనట్టు తెలుస్తోంది. బీవీ నగర్ లోని రాజు కాంప్లెక్స్ నివాసం ఉంటున్న కోడూరు రమ్య అనే విద్యార్థిని స్థానిక కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అదే కాలనీకి చెందిన శివభార్గవ్, అతడి స్నేహితులు వాసు, సాయి కిరణ్  లకు  సెల్ఫీ వీడియో పంపింది. తరవాత ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ విషయాన్ని వాళ్లెవరూ యువతీ ఇంట్లోవాళ్ళకి చెప్పలేదు. ఆమె ఆత్మహత్య అనంతరం ఫోన్ చూడగా ముగ్గురు యువకులకు వీడియో సందేశం పంపినట్టు తెలిసింది. ఈ ఘటనపై ఆమె సోదరుడు మాట్లాడుతూ.. "మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా అక్క ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో నేను, శివభార్గవ్ ఒకేచోట ఉన్నాం. కనీసం ఇలా సూసైడ్ చేసుకుంటుందనే విషయాన్ని కూడా వారు నాకు చెప్పలేదు. ఒక్క మాట చెప్పినా అక్క ప్రాణం కాపాడుకునే వాడిని. ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం అక్క ఫోన్ చెక్ చేస్తే అసలు విషయం తెలిసింది" అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. విద్యార్థిని తల్లి తండ్రులు సైతం యువకుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని అన్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.