కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కొత్త ఛైర్మన్‌

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కొత్త ఛైర్మన్‌

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా ఎ. పరమేశంను నియమించింది కేంద్ర జలవనరుల శాఖ.. ఇప్పటి వరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చిన పరమేశం... ఇప్పుడు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.. పరమేశంను కృష్ణా బోర్డు చైర్మన్‌గా నియమించిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది కేంద్ర జలవనరుల శాఖ.. కాగా, ఇప్పటి వరకు కృష్ణా బోర్డు ఇంచార్జి చైర్మన్‌గా వ్యవహరించారు చంద్రశేఖర్ అయ్యర్. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తున్నసమయంలో పరమేశం నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది..